Raghu veerareddy
-
ఇక్కడ టీడీపీ డమ్మీ..!
సాక్షి, కల్యాణదుర్గం : కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 13 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, టీడీపీ ఐదుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, సీపీఐ, జేఎన్పీ ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ దఫా కల్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండటమే. ఇక్కడ వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. చీకటి ఒప్పందంతో బరిలోకి ‘డమ్మీ’ ఏపీలో కాంగ్రెస్ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. దీంతో కనీసం పీసీసీ చీఫ్‌ను గెలిపించాలని చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ ఆయనను గెలిపిస్తే.. మిగిలిన చోట్ల తాము సహకరిస్తామన్నారు. దీంతో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పెద్దగా ఎవరికీ తెలియని తృతీయ శ్రేణి నేత ఉమామహేశ్వర్‌కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ ‘ఫ్యాన్’ హోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఏటికి ఎదురీదుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలు తేటతెల్లం కావడంతో ఈ రెండు పార్టీలను ప్రజలు దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీకి ఈ పరిణామాలు మరింత కలిసొచ్చే అంశం. ఆరోపణలు, విభేదాలతో టీడీపీ సతమతం కల్యాణదుర్గం నుంచి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో 22,318 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గెలుపునకు ఈ మెజార్టీ దోహదపడింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చిన స్థానం ఇదే. ఈ ఎన్నికల్లో చౌదరికి టిక్కెట్ రాకుండా జేసీ దివాకర్‌రెడ్డి అడ్డుపడ్డారు. దీనికితోడు చౌదరి కుటుంబం అవినీతి విషయంలో రెచ్చిపోయింది. విండ్ పవర్ భూముల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌కు పాల్పడింది. రైతుల నుంచి ఎకరా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకే భూములు కొనుగోలు చేసి.. అవే భూములను విండ్ పవర్ సంస్థకు రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షలకు విక్రయించారు. నియోజకవర్గంలో వేల ఎకరాల భూములను విండ్ పవర్ కోసం కంపెనీలు కొనుగోలు చేశాయి. రైల్వే కాంట్రాక్టుల్లో కూడా ఆయన కుటుంబం భారీగా లబ్ధి పొందింది. నియోజకవర్గంలో జరిగిన పనులు, ఇతర కాంట్రాక్టుల్లో ఆ కుటుంబ సభ్యులు చేతులు పెట్టారు. ఈ పరిణామాలతో టీడీపీ ప్రతిష్ట బాగా దెబ్బతింది. దీనికి తోడు స్థానిక నేతలైన రామ్మోహన్ చౌదరి, నారాయణ, రమేశ్, మల్లికార్జున వంటి నాయకులు చౌదరికి టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారు. స్థానికులకే సీటివ్వాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఎస్ఆర్ కనస్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారం చేసుకోమని ఫోన్లో సూచించారు. ఆ రెండు పార్టీలకూ ముప్పే రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గం మడకశిర. పునర్విభజనలో భాగంగా 2009లో మడకశిర ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆయన కల్యాణదుర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో పెనుకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ తిరిగి కల్యాణ దుర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. టీడీపీ సహకారం లభిస్తుందని ఆశించినా.. మూడు దశాబ్దాల పాటు సైకిల్ గుర్తుకు ఓటేసిన ప్రజలు ఒక్కసారి హస్తానికి వేయాలంటే కుదరని పని. దీంతో టీడీపీ ఓట్లు రఘువీరా, ఉమామహేశ్వరావు చీల్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరి కూడా టీడీపీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. టీడీపీలో విభేదాలు.. వైఎస్సార్సీపీలో ఐక్యతా రాగం టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరిని వ్యతిరేకించిన వారంతా ఉమామహేశ్వరరావుకు కూడా సహకారం అందించడం లేదు. స్థానికులకు సీటివ్వాలని తాము కోరితే స్థానికేతరులకు ఇచ్చారన్న అక్కసుతో పార్టీ శ్రేణులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిమి పాలైన తిప్పేస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డితోపాటు నేతలంతా ఉషాశ్రీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఇది వైఎస్సార్ సీపీకి లాభించే అంశం. మరోవైపు రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా గెలవాలనే తాపత్రయంతో బరిలో ఉన్న పీసీపీ చీఫ్‌కు వాతావరణం అనుకూలంగా లేదు. ఓటర్ల వివరాలు మొత్తం : 2,10,622 పురుషులు : 1,06,341 మహిళలు : 1,04,275 ఇతరులు: 06 – మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం -
తనయుడి కోసం తండ్రి త్యాగం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం తానే అవుతానన్న ధీమాతో మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి భవిష్యత్ రాజకీయ వ్యూహ రచనలో మునిగిపోయారు. సుదీర్ఘ కాలం తాను ఎమ్మెల్యేగా పనిచేసిన నాగార్జునసాగర్ (అంతకుముందు చలకుర్తి) నియోజకవర్గంలో తన కుమారుడు రఘువీర్‌రెడ్డిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందు నుంచి తనకు పట్టున్న మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయాలని జానారెడ్డి నిర్ణయించుకున్నారని, ఇందుకు పార్టీ అధిష్టానం కూడా అనుమతి ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. తాను మిర్యాలగూడ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారు కావడంతో, సాగర్ నుంచి రఘువీర్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జానారెడ్డి నియోజకవర్గం మారితే.. తమకేమన్నా అవకాశం దక్కుతుందేమోనని ఎదురుచూస్తున్న కొందరు ఆశావహులకు నిరాశే కలగనుంది. సీఎం అభ్యర్థిగా ప్రచారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని, ఆ మేరకు నియోజకవర్గంలో సీఎం అభ్యర్థిగానే ప్రచారం చేయాలన్న వ్యూహంతో జానారెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను సీఎం పదవిని దక్కించుకోలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలన్న యోచనలో కూడా ఉన్నారని వారు వివరిస్తున్నారు. ఈసారి ఓడినా, గెలిచినా తనకంటూ ఒక నియోజకవర్గం ఉండే విధంగానే రఘువీర్‌కు సాగర్‌ను వదిలి జానారెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. 1983 నుంచి జానారెడ్డికి తిరుగులేని కోటగా ఉన్న నాగార్జునసాగర్‌లో కుమారుడిని గెలిపించుకోవడం కష్టం కాదని భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.భాస్కర్‌రావు గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరడం తో జానారెడ్డి ఈ స్థానాన్ని ఎంచుకున్నారని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. -
అన్ని వర్గాల ఆత్మబంధువు కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, తమ పార్టీ నేతృత్వంలోనే దళిత, గిరిజన, ఆదివాసీ, మైనార్టీ, మహిళల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నేతలు ఉద్ఘాటించారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ దీక్ష’జరిగింది. దీక్షకు హాజరైన పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. దేశంలో దళితుల హక్కులను నీరుగార్చే కుట్ర జరుగు తోందని ఆరోపించారు. రాష్ట్రంలోనూ దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్ తానే ఆ కుర్చీలో కూర్చుని అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ దళితులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలను ప్రశ్నించాలి: ఉత్తమ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు విధ్వంసకర ఘటనల్లో చాలా మంది దళితులు చనిపోయారని, తెలంగాణలోనూ కేసీఆర్ నేతృత్వంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ దాడులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వాలు దళితుల పట్ల అనుసరిస్తున్న విద్వేషకర విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసమే రాజ్యాంగం అట్రాసిటీ చట్టాన్ని ఇచ్చిందని, ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దళిత హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాల వైఖరిని ఎదుర్కొనేందుకు పోరాడతామన్నారు. మతకల్లోలాలతోనే బీజేపీ గెలుపు: జైపాల్ కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ మతకల్లోలాలు జరిగిన చోటే బీజేపీ గెలుస్తుందని, అవి జరగకపోతే బీజేపీ ఎక్కడా గెలవదని అన్నారు. ప్రభుత్వ లాయర్లు సరిగా వాదించకపోవడం వల్లనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నీరుగారేలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీలో బీజేపీకి మిత్రుడిగా, గల్లీలో శత్రువుగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాకముందు కేసీఆర్ తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారని, అధికారం వచ్చాక మాట తప్పారని అన్నారు. ఒక్క సంవత్సరంలో ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పిన భారీ అంబేడ్కర్ విగ్రహం ఎక్కడని ప్రశ్నించారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ మార్కు రాజ్యాంగం, రాష్ట్రంలో కేసీఆర్ మార్కు రాజ్యాంగం నడుస్తున్నాయని ఆరోపించారు. నాటి అప్రజాస్వామిక విధానాలపై ప్రజలను కదలించిన మహానేత వైఎస్ మహాపాదయాత్ర చేపట్టి 15 ఏళ్లు అవుతోందని, ప్రజల అడుగుల్లో అడుగేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్‌తోనే సమాన హక్కులు: రఘువీరా దీక్షకు హాజరైన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులు, మహిళలు, మైనారిటీలు, గిరిజనులకు ఒక రక్షణ కవచమని, అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లా డుతూ దళితులను ఇసుక ట్రాక్టర్ల కింద నలిపేసిన చరిత్ర కేసీఆర్‌దని అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్ట పరచాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం తాను చేపట్టిన దీక్షను సాయంత్రం 5 గంటల సమయంలో ఉత్తమ్ విరమించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. 23న ఢిల్లీలో.. దేశంలోని దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 23న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం జరుగుతుందని ఉత్తమ్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొనే ఈ సమ్మేళనానికి రాష్ట్రంలోని దళిత నేతలంతా హాజరు కావాలని కోరారు. -
గవర్నర్‌కు రఘువీరా రెడ్డి లేఖ
-
గవర్నర్‌కు రఘువీరా లేఖ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి గురువారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాలుగో విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం.. తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంగా జరిపి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమం మొత్తం ఖర్చును తెలుగుదేశం పార్టీ నుంచి ప్రభుత్వ ఖజానాకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ అవసరాల కోసం, గ్రామాలను నియంత్రించడానికి ‘జన్మభూమి కమిటీ’లను నియమించిందని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. రాజ్యాంగస్పూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. -
అణగారిన వర్గాలకు అండ కాంగ్రెస్
► పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిత్తూరు (అగ్రికల్చర్): అణగారిన నిరుపేద వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత యాత్రలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన సభలో రఘువీరారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు. త్వరలోనే చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిస్సిగ్గుగా దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబు అవినీతి పాలనకు నిదర్శనమన్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవహరించేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, సుబ్రమణ్యం, తుకారామ్, సంపత్, మొదలి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులో చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత యాత్రను ఆ పార్టీ నాయకులు ఘనంగా చేపట్టారు. స్థానిక పీసీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభించారు. అనంతరం బైక్‌ర్యాలీలో దర్గా సర్కిల్ వరకు వెళ్లి అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బంగారుపాళెంలో... బంగారుపాళెం: ప్రజలపై మోపిన విద్యుత్, బస్సు చార్జీల భారాన్ని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బస్సు యాత్రలో భాగంగా బంగారుపాళెం మండలం బలిజపల్లె వద్ద ఆగారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు భోజనపాటి రవీంద్రనాయుడు మామిడి తోటలో మాట్లాడారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత 2 వేల మెగావాట్ల మిగులు విద్యుత్ ఉందన్నారు. టీడీపీ ఎన్నికల హామీ 9 గంటల కరెంటు ఊసే లేదన్నారు. బొగ్గు కొనుగోళ్లలో కమీషన్లకు కక్కుర్తి పడుతూ ప్రైవేటు వారికి కొమ్ముకాస్తున్నారన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే పోరాటం మదనపల్లె సిటీ : రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండులో బస్సు యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం డబ్బులు పెట్టిన నారాయణకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాక పోయినా ఏకంగా మంత్రి పదవి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పాల్గొన్నారు. -
కాంగ్రెస్ జాబితా ఖరారు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. జిల్లాలోని యర్రగొండపాలెం మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒంగోలు, బాపట్ల, నెల్లూరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని దర్శి పవన్‌కుమార్‌కు, బాపట్లను పనబాక లక్ష్మికి, నెల్లూరును వాకాటి నారాయణరెడ్డికి కేటాయించారు. అసెంబ్లీ అభ్యర్థులు వీరే... ఒంగోలుకు ఎద్దు శశికాంత్‌భూషణ్, సంతనూతలపాడుకు నూతలపాటి తిరుమలరావు, కొండపికి గుర్రాల రాజ్‌విమల్, కందుకూరుకు రాచగొర్ల వెంకట్రావు యాదవ్, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురానికి ఏలూరి రామచంద్రారెడ్డి, గిద్దలూరుకు కందుల గౌతంరెడ్డి, దర్శికి కే జ్వాలారావు, అద్దంకికి గాలం లక్ష్మీయాదవ్, పర్చూరుకు మోదుగుల కృష్ణారెడ్డి, చీరాలకు మెండు నిషాంత్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు.