పార్వతీపురం : అంబేద్కర్ ఓవ ర్సీస్ విద్యానిధి పథకం ద్వారా గిరిజన విద్యార్థులు ఇతర దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించుటకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం నుంచి గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద 100 మంది అర్హత గల గిరిజన విద్యార్థులకు జనాభా ప్రాతిపదిక ఆధారంగా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదువడానికి అవకాశం కల్పించిందన్నా. ఆసక్తి గల గిరిజన విద్యార్థులు ఈపాస్ ఆన్‌లైన్ ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
దీనికి గాను(హెచ్‌టీటీపీ// డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ . ఏపీ సోషల్‌వెల్ఫేర్ .సీజీజీ.జీఓవీ.ఇన్)లో ఆన్‌లైన్ ద్వారా సంబంధిత అధికారులు జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, సంబంధిత అధికారులు జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం (వయస్సు 1 జూలై 2013 నాటికి 35 సంవత్సరాలు లోపు ఉండాలి). ఆధార్ కార్డు, ఈపాస్ ఐడి నెంబర్, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు కాపీ, పదవ తరగతి/ ఇంటర్/ డిగ్రీ/ పీజీ లెవల్‌మార్కుల జాబితా, జీఆర్‌ఇ/జిమేట్ తత్సమాన పరీక్ష పాసైన ధ్రువీకరణ పత్రం, మార్కుల జాబితాకార్డు, టోఫెల్/ ఐ.ఇ.ఎల్.టి.ఎస్ స్కోర్‌కార్డు, ఫారెన్‌యూనివర్సిటీల నుంచి వచ్చిన అడ్మిషన్ ఆఫర్ లెటర్ (తత్సమానమైన), ఇటీవల కట్టిన టేక్స్ అసెస్‌మెంట్ కాపీ, జాతీయ బ్యాంకులో ఖాతా పుస్తక వివరాలు, ఫోటోస్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాలి.
విద్యార్హతలు: (పోస్టుగ్రాడ్యుట్ కోర్సులు 60శాతం మార్కులు ఉండవలెను, పీహెచ్‌డీ కోర్సులు 60శాతంమార్కులు ఉండవలెను), ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తించును.. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2,50,000 మించి యుండరాదు. అమెరికా, ఇంగ్లాండ్, అస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలలో మాత్రమే చదువుటకు అవకాశం కలదు. స్కాలర్‌షిప్ మంజూరు చేయు మొత్తము రూ. 10 లక్షలు రెండు వాయిదాలలో చెల్లింపు జరుగుతుందన్నారు.
విదేశాల్లో గిరిజన విద్యార్థుల చదువుకు అవకాశం
Published Fri, May 29 2015 3:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement