విజయనగరం జిల్లా కురుపాం మండలం మొండెన్‌కల్ గ్రామానికి చెందిన ఓ వివాహిత శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది.
పార్వతీపురం: విజయనగరం జిల్లా కురుపాం మండలం మొండెన్‌కల్ గ్రామానికి చెందిన ఓ వివాహిత శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. బిడ్డిక సోమన్ని అనే మహిళ తన చేతి గాజులను పొడి చేసుకుని దాన్ని నీటితో కలిపి తాగింది. ఆమెను స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మానసిక స్థితి సరిగా లేక ఆమె ఈ పని చేసినట్టు తెలుస్తోంది. సోమన్ని భర్త వెంకన్న డ్రైవర్‌గా పని చేస్తుంటాడు.