పార్వతీపురం (విజయనగరం) : తమ బకాయిలు చెల్లించని షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం చోటుచేసుకుంది. సీతానగరం మండలంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ.. రైతులకు దాదాపు రూ. 8 కోట్లు బకాయిపడింది. దీంతో రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై కోర్టుకు వెళ్లారు.
బకాయిలు దఫాల వారీగా చెల్లించాలని కోర్టు తెలిపింది. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారులు పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరుపగా వారు పలు దఫాలుగా ఆగస్టు నెల ఆఖరుకు అందరికీ బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. కానీ మాట ప్రకారం బకాయిలు చెల్లించలేదు. దీంతో రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను రైతులు కోరారు.
'ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేయండి'
Published Mon, Aug 31 2015 7:00 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement