లోవోల్టేజీపై సమరం | low voltage problem.. formers dharna | Sakshi
Sakshi News home page

లోవోల్టేజీపై సమరం

Published Fri, Feb 10 2017 1:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

లోవోల్టేజీపై సమరం - Sakshi

లోవోల్టేజీపై సమరం

చింతలపూడి : విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లింగగూడెం సబ్‌స్టేషన్‌ పరిధిలోని రైతులు రోడ్డెక్కారు. లోవోలే్టజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని, పంటలకు నీరందక ఎండిపోతున్నాయని మేడిశెట్టివారిపాలెం, చింతంపల్లి, గున్నేపల్లి  గ్రామాలకు చెందిన రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ఎ దుట బైఠాయించి ధర్నా చేశారు. మెట్ట ప్రాంతంలో ప్రస్తుతం వేరుశనగ, అరటి, మొక్కజొన్న, ఆయిల్‌పామ్, జామ తోట లతో పాటు రబీ వరి సాగులో ఉన్నాయని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.బలరామ్‌ అన్నారు. కొద్దిరోజులుగా లోవోలే్టజీ కారణంగా మోటార్లు తిరగడం లేదని, కొన్నిచోట్ల కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సరిగా నీరందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంట లకు 9 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. నెలరోజు లుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా విద్యుత్‌ శాఖాధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అధికారులు ఎంతకీ రాకపోవడంతో చింతలపూడి–సత్తుపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. రాఘవాపురం ట్రాన్స్‌కో ఏఈ బాణావతు వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. లోవోలే్టజీ సమస్యను పరిష్కరిస్తామని హా మీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో సీపీఎం డివిజన్‌ కార్యదర్శి రామిశెట్టి సత్యనారాయణ, రైతులు రాజబోయిన నరసింహారావు, చందా శ్రీను పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement