NCS sugar Factory
-
‘రైతుల ఆందోళనపై బాబు రాజకీయం మానుకోవాలి’
సాక్షి, విజయనగరం: ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీతో రైతుల బకాయిల వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతుల డిమాండ్, యాజమాన్య వైఖరిపై చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడి, పోలీస్ సిబ్బందికి గాయాల విషయాన్ని జిల్లా ఎస్పీ దీపికా మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి రైతులకు త్వరగా న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాజమాన్యంతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతుల ఆందోళనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడం మానుకోవాలని రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందని పేర్కొన్నారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకుందని తెలిపారు. రైతులపై లాఠీచార్జ్ చేశారని అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ముసుగులో వామపక్షనాయకలు పోలీసులపై రాళ్లు రువ్వారని అన్నారు. పోలీసులకు గాయాలు అయ్యాయని అయినా పోలీసులు సంయమనం పాటించారని గుర్తుచేశారు. ఏ ఒక్క రైతుపై చేయిచేసుకోలేదన్నారు. ఎన్సీఎస్ యాజమన్యానికి చెందిన 24 ఎకరాల భూమి వేలం వేయడానికి న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అదుపులో 34వేల బస్తాల పంచదార ఉందని, వీటిని విక్రయించి రైతుల బకాయి రూ. 16కోట్ల చెల్లిస్తామని అన్నారు. 2013-2014 రైతుల బకాయిలు రూ. 20 కోట్లు 2019లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక సెటిల్ చేశామని తెలిపారు. చదవండి: 14 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం మంచి నీళ్లు ఇవ్వలేకపోయారు: పెద్దిరెడ్డి చంద్రబాబు తన 5 ఏళ్ల కాలంలో ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. యాజమాన్యంపై ప్రభుత్వానికి నమ్మకం లేదని, 2019-20కి సంబంధించిన బకాయిలు ప్రతి రైతుకు పైసాతో సహా చెల్లింపులు జరపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.సాగు చేసిన చెరుకును ఇతర ఫ్యాక్టరీలకు మళ్లించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడే గంజాయి సాగు జరుగుతోందని చంద్రబాబు అంటున్నారని, కానీ ఆయన పాలనా కాలంలోనే ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా గంజాయి ఎగుమతి అవుతోందని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు అనడం నిజం కాదా అని నిలదీశారు. అమరావతి రైతులు ఎక్కడున్నారు అది టీడీపీ రాజకీయ పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. విశాఖ రాజధాని కాకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మేలు చేయండని పవన్ కళ్యాణ్ అడగడం లేదని, బిర్యానీ, భోజనం పెడతా ఆందోళన చేద్దాం రండని పిలుపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. చదవండి: CM YS Jagan: సీఎం జగన్‌ని కలిసిన అజేంద్ర బహదూర్‌సింగ్ -
'ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేయండి'
పార్వతీపురం (విజయనగరం) : తమ బకాయిలు చెల్లించని షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం చోటుచేసుకుంది. సీతానగరం మండలంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ.. రైతులకు దాదాపు రూ. 8 కోట్లు బకాయిపడింది. దీంతో రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై కోర్టుకు వెళ్లారు. బకాయిలు దఫాల వారీగా చెల్లించాలని కోర్టు తెలిపింది. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారులు పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరుపగా వారు పలు దఫాలుగా ఆగస్టు నెల ఆఖరుకు అందరికీ బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. కానీ మాట ప్రకారం బకాయిలు చెల్లించలేదు. దీంతో రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను రైతులు కోరారు. -
రహదారి దిగ్బంధానికి రైతుల పిలుపు
విజయనగరం: ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు బాకీపడిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘం ఆదివారం రహదారుల దిగ్బంధాని పిలుపునిచ్చింది. సీతానగరంలో ఎడ్లబండ్లతో రహదారి దిగ్బంధించి రైతులు తమ నిరసల తెలపనున్నారు. దీంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చెందుకు గ్రామానికి 50 మంది చొప్పున పోలీసులను మోహరించారు. -
బకాయిలు చెల్లించకపోతే రహదారి దిగ్బంధనమే
విజయనగరం (పార్వతీపురం) : రైతులకు చెల్లించాల్సిన పాత, కొత్త బకాయిలు మే 5 లోపు చెల్లించకపోతే జాతీయ రహదారిని దిగ్బంధనం చేస్తామని సోమవారం రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. వివరాల ప్రకారం.. సీతానగరం మండలం లచ్చయ్యపేటలోని ఎన్సీఎస్ ఘగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం.. రైతులకు సుమారు రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు, అధికారుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బకాయిలు ఈ నెలాఖరులోగా చెల్లించాలి. కానీ ఇప్పటివరకు రైతులకు ఎలాంటి చెల్లింపు జరుగలేదు. కాగా వచ్చే నెల 5వ తేదీ లోపు చెల్లించకపోతే మే 8న జాతీయ రహదారి దిగ్బంధనం చేస్తామని రైతులు ఆర్డీఓ గోవిందరావుకు స్పష్టం చేశారు. ఆర్డీవోను కలిసిన వారిలో రైతు సంఘాల నాయకులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు కూడా ఉన్నారు. -
'ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా'
విజయనగరం: రాష్ట్రంలోని చెరుకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సీతా నగరంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాకర్టీ వద్ద చెరుకు రైతులు చేపట్టిన మహాధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. చెరుకు రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వం హామీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు. -
ఏం చేస్తారో.. ఏమో..!
కడుపు మండిన రైతులు రోడ్డెక్కి సరిగ్గా 50 రోజులైంది. అప్పట్లో ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో ఐదు రోజుల పాటు ఎన్సీఎస్ ఫ్యాక్టరీ ఆవరణ అట్టుడికిపోయింది. అర్ధరాత్రి రైతు సంఘం నేతల అరెస్ట్‌లతో పోరు తీవ్ర తరమైంది. మా కష్టాన్ని కాజేసిన ఫ్యాక్టరీ యాజమాన్యానికి కాపలా కాస్తారా అంటూ పోలీసులు, అధికారులపై రైతులు విరుచుకుపడ్డారు. బకాయిలు, తమకు తెలియకుండా తమపేరుమీద తీసుకున్న రుణాలు చెల్లించాలని పట్టుబట్టారు. ఆస్తులు జప్తుచేసి, అప్పులు తీరుస్తామని అధికారులు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇంకా రూ.10 కోట్ల వరకూ ఫ్యాక్టరీ చెల్లించవలసి ఉంది. ఈ నేపథ్యంలో చెరుకు మద్దతు ధర నిర్ణయించడానికి ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించనున్నారు. దీంతో ఇటు రైతులు, అటు అధికారులు, పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సర్వత్రా ఉత్కంఠ ! * నేడు చెరుకు రైతులతో ఎన్సీఎస్ యాజమాన్యం సమావేశం * క్రషింగ్ ముందు రోజు చర్చలు నిర్వహించడంపై సందేహాలు * ఇప్పటివరకూ జరగని చెల్లింపులు బొబ్బిలి: ఎన్సీఎస్ చక్కెర కర్మాగారంలో శనివారం నిర్వహించనున్న సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయో, రైతుల డిమాండ్లకు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో, రైతులు, ఆయా సంఘాలు నాయకుల దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఉత్కంఠగా మారింది. ఫ్యాక్టరీలో క్రషింగ్ నాటికి రైతులందరికీ పూర్తిగా చెల్లింపులు చేయాలన్నది రైతు సంఘాల డిమాండ్. రాష్ట్రంలోని ఎక్కువ సామర్థ్యం గల ఫ్యాక్టరీ చెల్లించ ధర ప్రకారమే ఇక్కడ రైతులకు చెల్లించాలని, ఈ ఏడాది చెరుకును సరఫరా చేసిన 15 రోజుల్లోగా చెల్లింపులు చేయాలని, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఇప్పటివరకూ రైతు సంఘం రైతుల తరఫున పోరాటాలు చేసి డిమాండ్లు పెట్టింది. అయితే వీటిపై ఎప్పటికప్పుడు యాజమాన్యం.... అధికారుల దగ్గర తలూపి చివరకు అమలు దగ్గరకు వచ్చేసరికి చుక్కలు చూపిస్తోంది. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో 17 మండలాలకు చెందిన రైతులు చెరకును సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 16 వేల మంది రైతులు సుమారు ఏడు వేల హెక్టార్లలో చెరుకు పండించారు. ప్రతీ ఏటా నవంబర్‌లో క్రషింగ్ చేస్తుంటారు. క్రషింగ్‌కు ముందు రైతులు, ప్రజాప్రతినిధులతో యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేయడం, దానిలో ధరను నిర్ణయించడం, 15 రోజులకు ఒక సారి చెల్లింపులు చేస్తామని హామీ ఇవ్వడం అనావాయితీగా వస్తోంది. అయితే గత మూడేళ్లుగా చెల్లింపులు సక్రమంగా లేకపోవడం, రైతుల పేరుతో ఎన్సీఎస్ కర్మాగారం బినామీ రుణాలు వాడేయడం వంటివి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అసలు చెల్లింపులు చేయలేదు. దాదాపు రూ.22 కోట్ల మేర ఫ్యాక్టరీ రైతులకు చెల్లించకుండా నేడూరేపూ అంటూ వాయిదా వేసింది. దీంతో అక్టోబరు 2న ఫ్యాక్టరీ దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ ఆందోళన అయిదు రోజుల పాటు కొనసాగింది. తమకు తెలియకుండా తమ పేరుమీద ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకులో రుణం తీసుకుందని పోలీసులకు రైతులు ఫిర్యాదు చేయడంతో ఎండీతో సహా ఇద్దరు డెరైక్టర్లను అరెస్టు చేశారు. డిసెంబరు నెలాఖరునాటికి చెల్లింపులు పూర్తిగా చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. దానిపై కూడా రైతులు మళ్లీ పోరాటాలకు దిగి తక్షణమే చెల్లింపులు చేసే విధంగా కౌంటర్ ఫైల్ కూడా దాఖలు అయ్యేలా ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 9న సుగర్ కేన్ కార్యాలయంలో రైతులు, యాజమాన్యంతో జేసీ రామారావు సమావేశం నిర్వహించారు. దానిలో 23వ తేదీన క్రషింగ్ ప్రారంభం నాటికి పూర్తిగా చెల్లింపులు చేస్తామని డెరైక్టరు శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అయితే అది ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు.. సరికదా క్రషింగ్‌కు వారం రోజుల ముందే సమావేశం పెడతామని చెప్పి, విస్మరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రషింగ్‌కు ఒక రోజు ముందు సమావేశం పెట్టి మళ్లీ తమను మోసం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడి పించాలని, టన్నుకు రూ 2,700 మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఫ్యాక్టరీ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి నిర్ణయాలను యాజమాన్యం ప్రకటిస్తుందో, దానిని అమలు చేయడానికి అధికారులు ఎటువంటి భరోసా ఇస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. సమావేశం దగ్గర ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తుకు సిద్ధమవుతున్నారు. -
బిగుస్తున్న ఉచ్చు..
* ముంబై జైల్లో ఉన్న ఎన్సీఎస్ ఎం.డిని తీసుకురావడానికి ప్రత్యేక బృందం * అక్టోబర్ 13న భూముల వేలం * బినామీ రుణాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు బొబ్బిలి : చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిం చకపోవడంతో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడిన ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం యాజామన్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిల్లులు చెల్లించకపోవడంతో రైతు లు కొద్ది రోజుల కిందట ఆందోళనలు చేసిన నేపథ్యం లో కర్మాగారం ఎం.డి నాగేశ్వరరావుతో పాటు డెరైక్టర్లు శ్రీనివాస్, మురళిపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6న డెరైక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏడో తేదీన అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు విశాఖలోని కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. వీరిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. డెరైక్టర్లు పోలీసులకు చిక్కడంతో తాజాగా బినామీ రుణాలపై బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు ఫిర్యాదులు చేయడానికి ముందు కు వస్తున్నారు. ఇప్పటికే పార్వతీపురం పోలీస్ స్టేషన్ లో ఒక రైతు తమ పేరుమీద బినామీ రుణాలు తీసుకు ని మోసం చేశారంటూ ఎన్సీఎస్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయగా, తాజాగా సీతానగరం మండలం బూర్జకు చెందిన ఎర్ర చిన్నంనాయుడు, పణుకుపేటకు చెందిన బంకురు తవిటినాయుడు, పూడి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న డెరైక్టర్లు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. బిల్లుల చెల్లింపులు, బినామీ రుణాలపై నమోదైన కేసుల నేపథ్యంలో దర్యాప్తు కోసం డెరైక్టర్లను తమకు అప్పగించాలని పోలీసులు చేసుకున్న వినతిని కోర్టు పరిశీలిస్తోంది. కాగా ఈ కేసుతో సంబంధముండి ఇప్పటికే ముంబైలో అరెస్టు అయి ఆర్ధర్ సబ్ జైల్లో ఉన్న ఎం.డి నాగేశ్వరరావును తీసుకురావడానికి పోలీసుల ప్రత్యేక బృందం ముంబై పయనమైంది. బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు ఒక వైపు యాజమాన్యంను అరెస్టు చేసినా రైతుల ఆందోళనలు చల్లారకపోవడంతో ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీస్ అధికారులు రైతులకు పేమెంట్లు చెల్లించడానికి చర్యలు తీసుకున్నారు. రైతులకు సుమారు 24 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, మొదటి విడతగా ఆరు కోట్ల రూపాయలను అధికారులు చెల్లిస్తున్నారు. పది వేల రూపాయల లోపున్న 15 వందల మంది రైతులకు ముందుగా బిల్లులు చెల్లిస్తున్నారు. మిగతా వారికి కూడా బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13న భూముల వేలం ఫ్యాక్టరీకి సంబంధించి రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న భూములను వచ్చే నెల 13న వేలం వేయనున్నారు. సీతానగరం మండల పరిధిలో ఉండే సుమారు 36 ఎకరాల భూమిని వేలం వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఈ నెల 8న ప్రకటన కూడా జారీ చేశారు. పార్వతీపురంలోని ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వేలం వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఇద్దరు ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల అరెస్ట్
-
ఇద్దరు ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల అరెస్ట్
విజయనగరం: జిల్లాలోని చెరుకు రైతుల తిరుగుబాటు ఫలించింది. సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, మురళీలను పోలీసులు అరెస్ట్ చేశారు. బకాయిలు చెల్లించాలని చెరుకు రైతులు వారం రోజులుగా రోడ్డు ఎక్కారు. నిన్న మండలంలోని రోడ్లను దిగ్బంధనం చేశారు. ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 11వేల మంది చెరుకు రైతులకు 24 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవలసి ఉంది. ఇదుగో ఇస్తాం, అదుగో ఇస్తాం అని చెబుతూ యాజమాన్యం 18 సార్లు వాయిదా వేసింది. దాంతో రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. వారం రోజుల నుంచి ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారంలో రైతులు షుగర్ ఫ్యాక్టరీ లోపలకు చొచ్చుకుపోయారు. లోపల యంత్రాలను, అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలోని చెట్లను కూడా పెకలించివేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా తమను బాధలకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమసొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అప్పులు చేసి చెరకు పండించి ఫ్యాక్టరీకి సరఫరా చేశామని చెప్పారు. ఏడాదిన్నర నుంచి తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని వారు వాపోయారు. అధికారులు, పాలకులు కూడా తమను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో చెరుకు రైతుల ఆందోళనపై పోలీసులు స్పందించారు. ఫ్యాక్టరీ ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. ఎన్సీఎస్ సుగర్స్ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులను వేలం వేసి రైతులకు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నాలుగు రోజుల క్రితం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి చెప్పారు. లచ్చయ్యపేటలోని భూముల రికార్డులను అనుసరించి గురువారం సర్వే నిర్వహించారు. షుగర్స్‌కు చెందిన 75.11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని చెరుకు రైతుల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ** -
తిరగబడిన రైతులు
-
తిరగబడిన రైతులు
విజయనగరం: సీతానగరం మండలంలో రైతులు తిరగబడ్డారు. తమ ప్రతాపం చూపారు. ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ బకాయిలు చెల్లించాలని రైతులు ఆందోళనకు దిగారు. వందల సంఖ్యలో రైతులు షుగర్ ఫ్యాక్టరీ లోపలకు చొచ్చుకుపోయారు. లోపల యంత్రాలను, అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలోని చెట్లను కూడా పెకలించివేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా రైతులను బాధలకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అప్పులు చేసి చెరకు పండించి ఫ్యాక్టరీకి సరఫరా చేశామని చెప్పారు. ఏడాదిన్నర నుంచి తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని వారు వాపోయారు. అధికారులు, పాలకులు కూడా తమను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఫ్యాక్టరీ దాదాపు 32 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించవలసి ఉంది. ఆవేదనతో రెచ్చిపోతున్న రైతులను అదుపు చేయడం పోలీసుల తరం కావడంలేదు. ఎంత ప్రయత్నించినా రైతులు వినే పరిస్థితి లేదు. రైతులు, పోలీసుల తోపులాటలో ఇరువైపుల పలువురికి గాయాలయ్యాయి. బకాయిల చెల్లింపుపై యాజమాన్యం ఒక ప్రకటన చేస్తే తప్ప తాము రైతులను అదుపు చేయలేమని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే అదనపు పోలీస్ బలగాలను రప్పించే ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం ఉంది. **