కలర్ గ్రానైట్స్‌కు అనుమతులు ఇవ్వొద్దని గిరిజనులు ఐటీడీఐ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
పార్వతీపురం(విజయనగరం జిల్లా): కలర్ గ్రానైట్స్‌కు అనుమతులు ఇవ్వొద్దని గిరిజనులు ఐటీడీఐ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన గురువారం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కేంద్రంలో జరిగింది. కలర్ గ్రానైట్స్ తవ్వకాలకు అనుమతులివ్వడం ద్వారా పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పీవోకు అనుమతులు ఇవ్వొద్దంటూ కోరుతూ వినతి పత్రం సమర్పించారు.