వంగపండు కుటుంబానికి మంత్రులు పరామర్శ | Sakshi
Sakshi News home page

వంగపండు కుటుంబానికి మంత్రులు పరామర్శ

Published Sun, Aug 16 2020 3:41 PM

AP Ministers Visit Vangapandu Prasada Rao Family - Sakshi

సాక్షి, పార్వతీపురం: ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని మంత్రులు ఆదివారం పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. వంగపండు ప్రసాదరావు కుమార్తె ఉష, కుమారుడు దుష్యంత్, భార్య విజయలక్ష్మిలకు ముఖ్యమంత్రి తరపున మంత్రులు సంతాపం తెలిపారు.

వంగపండు మృతి ఉత్తరాంధ్ర లోని పేదలు, అట్టడుగు వర్గాల వారికి లోటని  ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు అని పేర్కొన్నారు. వంగపండు ప్రసాదరావు భౌతికంగా లేకపోయినా ఆయన పాట, మాట ఈ పుడమి వున్నంత కాలం చిరస్థాయిగా నిలిచి వుంటాయని మంత్రి పేర్ని నాని అన్నారు. అట్టడుగు వర్గాల, గిరిజనుల గొంతుక గా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి వాటి పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి వంగపండు ప్రసాదరావు అని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement