తోడబుట్టిన అన్నలు చనిపోవడంతో మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి భర్త వెంకటరావు
పార్వతీపురం : తోడబుట్టిన అన్నలు చనిపోవడంతో మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి భర్త వెంకటరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కురుపాం మండలం మామిడిమానుగూడకు చెందిన మేనకకు మగ్గురు అన్నయ్యలున్నారు. వీరిలో కొండగొర్రి సొత్తన్న, రోనాయ్‌లు ఇటీవల కన్నుమూశారు. అప్పటి నుంచి మేనక మనోవేధనకు లోనై ఎప్పుడూ ఏడుస్తూ కనిపించేంది. తన అన్నలు కలలో కని పిస్తున్నారని, తాను కూడా చనిపోయి వారి వద్దకు వెళ్లిపోతానని తరచూ చెప్పేది. ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లో ఉన్న చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంట నే ఆమె భర్త మేనకను పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.