రోడ్డుప్రమాదంలో విద్యార్థికి తీవ్రగాయాలు | B.Pharmacy Student injured in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో విద్యార్థికి తీవ్రగాయాలు

Published Thu, Jan 21 2016 4:35 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

B.Pharmacy Student injured in Road accident

పార్వతీపురం (విజయనగరం) : పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్‌కు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం బైపాస్‌ రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. చంద్రంపేటకు చెందిన ఎస్.సాయికృష్ణ(22) స్థానిక కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నాడు.

ఈ క్రమంలో బైపాస్ రోడ్డుపై ఉన్న పెట్రోల్‌బంక్‌లోకి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement