రోడ్డుప్రమాదంలో విద్యార్థికి తీవ్రగాయాలు
పార్వతీపురం (విజయనగరం) : పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్‌కు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం బైపాస్ రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. చంద్రంపేటకు చెందిన ఎస్.సాయికృష్ణ(22) స్థానిక కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నాడు.
ఈ క్రమంలో బైపాస్ రోడ్డుపై ఉన్న పెట్రోల్‌బంక్‌లోకి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.