విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజన సంఘాలు, గిరిజనులు సోమవారం ముట్టడించారు.
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజన సంఘాలు, గిరిజనులు సోమవారం ముట్టడించారు. మండలంలోని బోడిపంట మీద కలర్ గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ధర్నాకు దిగారు. ధర్నా విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్వల్ప తోపులాట జరిగింది.