జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. సోమవారం వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ప్రతాపం చూపిన సూర్యభగవానుడు మంగళవారం శాంతించాడు