పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలో గురువారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ విశాఖపట్నంకు చెందిన ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ఆర్.కె.సింగ్, నవీన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో జరిగిన దాడులు వేకువజాము మూడున్నర గంటలవరకు కొనసాగాయి. పట్టణంలోని డా.యాళ్ల వివేక్, డా.యాళ్ల పద్మజలకు చెందిన జయశ్రీ ఆస్పత్రితోపాటు, యిండుపూరు బ్రదర్స్ గుంపస్వామి, గున్నేష్, ప్రభాకర్, శ్రీనివాసరావు, గోపాలరావులకు చెందిన విజయలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, యిండుపూరు జ్యూయలర్స్, శ్రీ మహాలక్ష్మీ జ్యూయల్ ప్యాలెస్, మహాలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్ తదితర బంగారం షాపుల్లో ఆరు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
కనీసం ఎవర్నీ కదలనీయకుండా చేపట్టిన ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడులతో పట్టణంలోని పన్ను ఎగవేతదారుల గుండెల్లో రైళ్లు పరుగులెడుతున్నాయి. అంతే కాకుండా శుక్రవారం కూడా మళ్లీ ఐటీ దాడులున్నాయన్న ప్రచారంతో పట్టణంలో దాదాపు పెద్ద పెద్ద వ్యాపార దుకాణాలు తెరచుకోలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఇన్‌కం ట్యాక్స్ రేంజ్-1 అధికారి రామునాయుడు జయశ్రీ ఆస్పత్రికొచ్చి డాక్టర్ యాళ్ల వివేక్‌తో గంటల కొలది చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా శుక్రవారం కూడా జయశ్రీ ఆస్పత్రిలో దాడులు కొనసాగాయనే ప్రచారం జోరందుకుంది.
అంతే కాకుండా వేరే బంగారం షాపు దాడిలో పాల్గొన్న ఆ అధికారి వచ్చి నేరుగా డాక్టర్‌తో గంటలు తరబడి చర్చలు జరపడం రెండోరోజు కూడా తనిఖీలు జరుగినట్టు చర్చించుకున్నారు. ఈ విషయమై ఆ అధికారి వద్ద విలేకరులు ప్రస్తావించగా.. తమ ఉన్నతాధికారులు మాట్లాడతారన్నారు. ఈ విషయమై డాక్టర్ వివేక్ వద్ద ప్రస్తావించగా.. సాధారణ తనిఖీలే అని చెప్పారు. ఐటీ అధికారి రామునాయుడు పార్వతీపురం ప్రాంతం అల్లుడు కావడంతో.. వైద్యం కోసం వచ్చారని, కావాలంటే ఆతని చేతిలో కళ్ల మందు చూడాలని చెప్పారు.
రాత్రంతా సాగిన ఐటీ దాడులు
Published Sat, Jun 6 2015 12:53 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
Advertisement