
టీవీ నటి దీప్తి కుమార్తె అదృశ్యం
పార్వతీపురం: గతంలో హైదరాబాద్‌లో మరణించిన టీవీ నటి దీప్తి కుమార్తె జ్యోతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిందని పట్టణ ఎస్సై వి.అశోక్ కుమార్ ఆదివారం రాత్రి తెలిపారు. పట్టణంలోని కొత్తవలస నందమూరి కాలనీకి చెందిన పెయింటర్, జ్యోతి తండ్రి జొన్నాడ ఈశ్వరరావు(శంకర్) చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఎస్సై అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 8న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కిరాణా దుకాణానికి వెళ్లివస్తానని జ్యోతి తన నానమ్మకు చెప్పి వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఈశ్వరరావు రాత్రి పెయింటింగ్ పని నుంచి వచ్చి కుమార్తె గూర్చి ఆరా తీయగా ఈ విషయం తెలిసింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. జ్యోతి స్థానిక ఆర్‌సీఎం పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.