
మహిళ ఆత్మహత్య
పార్వతీపురం: అనారోగ్యాన్ని తట్టుకోలేక ఓ మహిళ మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఇందిరా కాలనీలో జరిగిన సంఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం గంటా వీధికి చెందిన బూర్లి వరణమ్మ (45) కొన్ని రోజులుగా థైరాయిడ్‌తో బాధపడుతోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమె బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు విషయం తెలుసుకొని మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.