
మహిళ ఆత్మహత్య
పార్వతీపురం : ఆర్థిక ఇబ్బం దులకు తాళలేక ఓ మహిళ ఆదివారం ఆ త్మహత్యకు పాల్పడింది. ఆమెకు కొంతకాలంగా మతిస్థిమితం కూడా సరిగా లేదు. దీ నికి సంబంధించి పా ర్వతీపురం పట్టణ పోలీసులు అందించిన వివరాల ప్రకారం... పట్టణంలోని మూడో వార్డు వివేకానందకాలనీకి చెందిన కోరాడ రాజేశ్వరమ్మ ఎనిమిదేళ్లుగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. దీని కోసం మందులు కూడా వాడుతోంది. అయితే మందులు కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆమె తీవ్రంగా బాధపడేది. ఆ బాధతోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు రాజేశ్వరమ్మ మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి పో స్టుమార్టం నిర్వహించారు. ఈమెకు భర్త రామారావు, కుమార్తె పుష్పకుమారి, కుమారుడు భాస్కరరావులు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు.