పార్వతీపురం: మెజార్టీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేయగా మిగిలిన ఏడుగురు కౌన్సిలర్లతో ఎజెండాను ఎలా ఆమోదిస్తారని వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు గొల్లు వెంకట్రావు, సీహెచ్ శ్రీనివాసరావు,ఓ రామారావు, చీకటి అనూరాధ తదితరులు కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడును నిలదీశారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మిగతా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులతోపాటు ద్వారపురెడ్డి శ్రీనివాస్, అతని సతీమణి ద్వారపురెడ్డి జ్యోతి, సంగం రెడ్డి లక్ష్మీపార్వతి తదితరులు కూడా చైర్‌పర్సన్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు.
అయితే ప్రతిపక్ష, వాకౌట్ చేసిన కౌన్సిలర్ల అందరితో ముందుగానే కమిషనర్ రికార్డులో సంతకాలు చేయించారు. అనంతరం సభ్యులంతా వాకౌట్ చేయడంతో ముందు రికార్డులో ఉన్న సంతకాల ఆధారంగా ఎజెండాలోని మొత్తం అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. ఈ విషయమై వారు కమిషనర్ నిలదీస్తూ మున్సిపల్ చట్టాలను తెలుసుకోవాలని సభ్యులు వాకౌట్ చేస్తే కోరం లేకుండా ఉన్న కౌన్సిల్‌లో ఎజెండా మొత్తాన్ని ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ విషయమై తాము ఉన్నతాధికారులకు, న్యాయస్థానానికి నివేదిస్తామని స్పష్టం చేశారు.
ఎజెండాను ఎలా ఆమోదిస్తారు..?
Published Thu, Oct 29 2015 12:34 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement