ప్రభుత్వం కిలో ఉల్లి రూ.20 లకే అందజేస్తుండటంతో రైతు బజార్లకు తాకిడి ఎక్కువైంది.
విజయనగరం (పార్వతీపురం) : ప్రభుత్వం కిలో ఉల్లి రూ.20 లకే అందజేస్తుండటంతో రైతు బజార్లకు తాకిడి ఎక్కువైంది. శుక్రవారం విజయనగరం జిల్లా పార్వతీపురం రైతుబజార్ వద్ద ఉల్లి కోసం తోపులాట జరిగింది. దీంతో కౌంటర్ వద్ద విక్రయం ఆపేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పరిస్థితి అంతా అదుపులోకి వచ్చిన తర్వాతే మళ్లీ ఉల్లి విక్రయం ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చేది రెండు కిలోలే అయినా రైతు బజార్‌ల వద్ద క్యూలైన్లు చూస్తే ప్రజలకు దిమ్మతిరిగిపోతుంది. నిన్న ఇదే రైతు బజార్ వద్ద క్యూలైన్‌లో నిల్చుని 10 మంది వృద్ధులు కళ్లు తిరిగి పడిపోయారు.