విజయనగరం జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది.
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామ సమీపంలోని వింజమ్మకొండ పై ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించారు.
కాగా.. మృతదేహం అదే గ్రామానికి చెందిన భారతి(30)దిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అత్యాచారం చేసి ఆ తర్వాత హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.