విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేశారు.
పార్వతీపురం(విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేశారు. శనివారం పట్టణంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషను పురుష పోలీసులే బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్ ఎక్కించారు.
బంద్‌లో పాల్గొన్న పార్వతీపురం నియోజకవర్గ ఇంచార్జీ జమ్మాన ప్రసన్నకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. పోలీసులు వామపక్షాల నాయకుడు రెడ్డి శ్రీరామమూర్తితో పాటు ఆపార్టీలకు చెందిన పలువురు నాయకులను అరెస్ట్ చేసి లారీల్లో తరలించారు.