ఈ నెల 4న ఐటీడీఏ ఆధ్వర్యంలో, స్థానిక వైటీసీలో అనంతపురానికి చెందిన రక్షా సెక్యూరిటీ సర్వీసెస్‌లో గిరిజన యువకులకు
పార్వతీపురం: ఈ నెల 4న ఐటీడీఏ ఆధ్వర్యంలో, స్థానిక వైటీసీలో అనంతపురానికి చెందిన రక్షా సెక్యూరిటీ సర్వీసెస్‌లో గిరిజన యువకులకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని ఐటీడీఏ పీఓ వి.ప్రసన్న వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అనంతపురం జిల్లాలోని రక్షా అకాడమీలో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం మంచి వేతనంతో ఉపాధి కల్పిస్తారన్నారు.
ఆసక్తి గలిగిన అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలన్నారు. అభ్య ర్థులు 18-30 సంవత్సరాలు వయసు కలిగి, 10వ తరతి పాస్‌తో పాటు 167 సెం.మీ ఎత్తు ఉండాలన్నారు. గిరిజన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు. వివరాలకు 08963-220489, 9502276560, 9491044611 నంబర్లను సంప్రదించాలన్నారు.