మావోయిస్టులూ మనుషులే...! | former minister satrucharla Vijaya Rama Raju | Sakshi
Sakshi News home page

మావోయిస్టులూ మనుషులే...!

Published Tue, Nov 8 2016 2:55 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

మావోయిస్టులూ మనుషులే...! - Sakshi

మావోయిస్టులూ మనుషులే...!

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు...
 పార్వతీపురం: మావోయిస్టులూ మనుషులేనని.. వారైనా... తామైనా.. పేదలకోసం పనిచేసేవారేననీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వ్యాఖ్యానించారు. పార్వతీపురంలోని ఆయన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ విషయంలో ఆయన స్పందిస్తూ మావోయిస్టులూ పేదలకోసమే పనిచేస్తున్నారనీ, తామూ పేదలకోసమే పనిచేస్తామని చెప్పారు. కొమరాడ మండలంలోని తొడుము, మాదలంగి గ్రామాల మధ్య గల గుమ్మిడిగెడ్డ వద్ద రూ.7.70కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో 1200 వరకు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేశామన్నారు. ఆయనతోపాటు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి బోర్డు డెరైక్టర్ మజ్జి కృష్ణమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయబాబు, మజ్జి వెంకటేష్, మజ్జి రాజా, పొట్నూరు వెంకటనాయుడు, డీసీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కళింగ మళ్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement