బాలికపై లైంగిక దాడి | Sexual assault on a girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

Published Sun, Mar 6 2016 7:51 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Sexual assault on a girl

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీలో ఓ బాలికపై 17 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం... సుబుద్ధి రాజేష్ (17) అనే యువకుడు గురువారం రాత్రి ఏడేళ్ల బాలికకు చాక్లెట్ ఇచ్చి, చీకట్లో ఓ ఇంటి పెరట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.

ఈ మేరకు ఆదివారం ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ వార్డుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు, సీపీఎంకు చెందిన మరో నాయకుడు, ఆ వీధికి చెందిన మరికొంతమంది పెద్దలు ఈ వ్యవహారాన్ని సెటిల్ మెంట్ చేసేందుకు మూడు రోజులుగా తమ నోరు నొక్కేస్తున్నారని బాధితురాలి తల్లి మీడియా ముందు వాపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement