
కృష్ణాజిల్లా, కానూరు (పెనమలూరు) : కానూరులో పెళ్లికి వచ్చిన ఓ మహిళ వద్ద బంగారు ఆభరణాలు చోరీ జరగటంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం హైదరాబాద్‌కు చెం దిన వి. లక్ష్మీపావని రెండు రోజుల క్రితం కానూరులోని ఓ కల్యాణ మం డపంలో బంధువుల పెళ్లికి వచ్చింది. ఆమె తన విలువైన 150 గ్రాముల ఆభరణాలు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టింది. కొద్ది సమయం తర్వాత బ్యాగ్‌లో చూసుకోగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా చోరీ జరిగిన బంగారు ఆభరణాల విలువ రూ.5 లక్షలు ఉంటుందని బా«ధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment