
అరెస్ట్ అయిన నిందితుడు
భువనేశ్వర్: దొంగతనానికి మార్గాలు అనేకం. పిలవని ఆతిథ్యానికి విచ్చేసి హుందాగా దోచుకుపోయిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఖండగిరి స్టేషన్ పోలీసులు ఆ దొంగను బుధవారం అరెస్టు చేసి నబిగా గుర్తించారు. నిందితుడి అనుచరుడి వివరాల్ని కూడా పోలీసులు ఖరారు చేసుకుని గాలిస్తున్నారు. నిందితుడి దగ్గర రూ. 3.98 లక్షల నగదుతో పాటు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక చంద్రశేఖర పూర్ ప్రాంతంలోని కల్యాణ మండపంలో వివాహ విందు కార్యక్రమంలో నిందితుడు ఈ సొత్తును దోచుకున్నాడు.
ఈ కార్యక్రమానికి నిందితుడికి ఎటువంటి ఆహ్వానం లేదు. వేదిక ప్రాంగణానికి హుందాగా విచ్చేసి ఆహ్వానం పొందిన అతిథులు సమర్పించిన కానుకలు, నగదును బ్యాగులో సర్దుకుని చల్లగా జారుకున్నాడు. ఈ సమగ్ర వృత్తాంతం వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ రికార్డింగ్‌లో లభ్యమైంది. దీని ఆధారంగా వివాహ విందు ఏర్పాటు చేసిన వర్గం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన వివాహ విందును పురస్కరించుకుని నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment