పింఛన్ ఇప్పిస్తామని చెప్పి.. బంగారం చోరీ | gold robbery from 2 old womens in warangal district | Sakshi
Sakshi News home page

పింఛన్ ఇప్పిస్తామని చెప్పి.. బంగారం చోరీ

Published Tue, Aug 11 2015 4:47 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

gold robbery from 2 old womens in warangal district

చేర్యాల(వరంగల్ జిల్లా): పింఛన్ ఇప్పిస్తానని చెప్పి రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు నిందితులు..  వృద్ధ మహిళల నుంచి బంగారు ఆభరణాలను కాజేశారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా చేర్యాల మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలోని బండపల్లికి చెందిన రామనర్సవ్వకు పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఒక వ్యక్తి అంగడి బజార్‌లోని ప్రభుత్వాస్పత్రి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు.

మరో ఘటనలో మండలంలోని చుంచనకోట గ్రామానికి చెందిన ఎంకవ్వ అనే వృద్ధురాలిని ఒక వ్యక్తి పింఛన్ ఇప్పిస్తానని చెప్పి సబ్‌రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు తీసుకొచ్చి బంగారం కాజేశాడు. దీంతో బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement