old womens
-
ఇంటికన్నా జైలే పదిలం
అక్కడంతా.. చేతులు ముడతలు పడిపోయి, నడుములు ఒంగిపోయి.. కొందరు వాకర్ల సహాయంతో.. ఇంకొందరు సహాయకుల ఆసరాతో కారిడార్లలో నెమ్మదిగా తిరుగుతూ ఉంటారు. భోజనం, మందులు ఇచ్చేది కూడా సహాయకులే. అది కచ్చితంగా వృద్ధాశ్రమం అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే అది జపాన్ రాజధాని టోక్యోలోని అతి పెద్ద మహిళా జైలు. వృద్ధ మహిళలు నేరాలు చేసి మరీ ఈ జైలుకు వస్తున్నారు. ఇంటి దగ్గరకంటే వారు జైలులో ఉండటానికే ఇష్టపడటానికి కారణం తెలియాలంటే ఇది చదవాల్సిందే! వినడానికి వింతగా ఉన్నా.. జపాన్‌లోని వృద్ధ మహిళలు జైళ్లలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఒంటరితనం. బయట వారికి లేని సాంగత్యం జైళ్లలో దొరుకుతోంది. అంతేకాదు క్రమం తప్పకుండా ఆహారం, ఉచిత ఆరోగ్య సంరక్షణ, వృద్ధాప్యంలో కావాల్సిన ఆసరా ఇక్కడ లభిస్తోంది. దీంతో జైలుకు వచ్చేందుకే ఇష్టపడుతున్నారు. యోకో అనే 51 ఏళ్ల మహిళ గత 25 ఏళ్లలో ఐదుసార్లు జైలు శిక్ష అనుభవించారు. తాను వచ్చిన ప్రతిసారీ జైలు జనాభా పెరిగినట్లు కని్పస్తోందని చెబుతున్నారు. ఒంటరితనానికి తోడు పేదరికం.. జైలులోకి రావడానికి అత్యధిక మంది చేసే నేరం దొంగతనం. వృద్ధ ఖైదీలు, ముఖ్యంగా మహిళల్లో దొంగతనం సర్వసాధారణమైన నేరం. 2022లో దేశవ్యాప్తంగా 80 శాతానికి పైగా వృద్ధ మహిళా ఖైదీలు దొంగతనాలకు పాల్పడి జైళ్లలో ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొందరు ఒంటరిగా ఉండలేక దొంగతనాలకు పాల్పడుతుంటే మరికొంతమంది మనుగడ కోసం చేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ప్రకారం.. జపాన్‌లో 65 ఏళ్లు పైబడిన వారిలో 20% మంది పేదరికంలో నివసిస్తున్నారు. సంస్థలో ఉన్న 38 సభ్య దేశాలలో ఈ సగటు 14.2% శాతం ఉండగా.. జపాన్‌దే అత్యధికం. పేదరికంలో ఉన్న పిల్లలు సైతం.. తమ తల్లిదండ్రులు ఆకలితో ఉండే కంటే ఇలా దూరంగా వెల్లిపోవడమే మంచిదని కోరుకుంటున్నారు. ఇదే జైలులో ఉన్న 81 ఏళ్ల అకియో పేదరికం, ఒంటరితనం రెండింటితో బాధపడుతున్నారు. రెండు నెలలకోసారి వచ్చే నామమాత్రపు పెన్షన్ ఆమెకు జీవనాధారం. ఆర్థిక స్థిరత్వం, సౌకర్యవంతమైన జీవనశైలిఉంటే కచి్చతంగా ఇలా చేసి ఉండేదాన్ని కాదని చెబుతారామె. గతంలో ఆహారాన్ని దొంగిలించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన అకియో.. జైలుకు రావడం ఇదిరెండోసారి. ఉచిత వైద్యం.. అనారోగ్యానికి గురైన వారు జైలులో ఉంటే వారికి ఉచిత వైద్యం అందుతుంది. బయటికి వెళ్తే దానికోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొంతమంది సాధ్యమైనంత ఎక్కువకాలం ఇక్కడ ఉండాలని కోరుకుంటారని జైలు గార్డు షిరానాగ తెలిపారు. ఇప్పటికీ జైళ్లు తెల్ల వెంట్రుకలు కలిగిన ఖైదీలతో నిండిపోయాయి. టోచిగిలో ఉన్న జైలులో ఐదుగురు ఖైదీలలో ఒకరు వృద్ధులు. ఇక్కడ ఒక్కచోటే కాదు.. జపాన్ అంతటా, 2003 నుంచి 2022 వరకు 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఖైదీల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఇది జైలు స్వభావాన్ని మార్చింది. ఇప్పుడవి వృద్ధాశ్రమాల్లా ఉన్నాయి. ఇక్కడ వారికి సహాయకులు ఖైదీలు తినడానికి, వారి స్నానానికి, డైపర్లు మార్చడానికి కూడా సహాయపడాలని షిరానాగ చెప్పారు. అది దోషులతో నిండిన జైలు కంటే నర్సింగ్ హోమ్ లాగా అనిపిస్తుందని చెబుతారాయన. సహాయక సిబ్బంది కొరత.. జపాన్‌లో వయోవృద్ధుల జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో సహాయక సిబ్బంది కొరత కూడా పెరుగుతోంది. 2040 నాటికి 21 లక్షల మంది సంరక్షణ కారి్మకులు అవసరమవుతారని ప్రభుత్వం తెలిపింది. జనాభా మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకోవడానకి తంటాలు పడుతోంది. ఇక జైలులో నర్సింగ్ అర్హతలు ఉన్న ఖైదీలను ఇతర వృద్ధ ఖైదీలకు నర్సింగ్ సంరక్షణను అందించమని అధికారులు కోరుతున్నారు. దీంతో వృద్ధ ఖైదీలను చూసుకోవడానికి తగినంత మంది జైలు సిబ్బంది లేనప్పుడు వారు సహాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
60 ఏళ్లు పైబడ్డ మహిళలంతా కలిసి డాన్సులు
-
హైదరాబాద్ లో ఇద్దరు వృద్దురాళ్ల కిడ్నప్
-
హతవిధీ! ఆ నోట్లు ఎంత పని చేశాయి
సాక్షి , చెన్నై : కన్నతల్లి మమకారం ఆ అక్కాచెల్లెళ్లను పొదుపరులుగా మార్చింది. ఏనాటికైనా చావు తప్పదు, అయితే తమ అంత్యక్రియలకు ఆయ్యే ఖర్చు తమ సంతానానికి భారం కాకూడదని తలచేలా చేసింది. ఏడుపదులు దాటిని వృద్ధాప్య దశలో ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇద్దరూ కలిసి గోప్యంగా దాచి ఉంచిన రూ.46వేలు బయటకు తీయగా అవన్నీ రద్దయిన పెద్దనోట్లు కావడంతో ఖిన్నులై కృంగిపోయారు. బిడ్డలకు చెప్పుకుని బోరుమని విలపించారు. తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని పూమలూరులో కే రంగమ్మాళ్ (75), పీ తంగమ్మాళ్ (72) అనే అక్కచెల్లెళ్లు నివసిస్తున్నారు. రంగమ్మాళ్‌కు ఏడుగురు, తంగమ్మాళ్‌కు ఆరుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లయి వేర్వేరు ఊళ్లలో కాపురం ఉంటున్నారు. వారిద్దరి భర్తలు చనిపోవడంతో పశువులు మేపడం వృత్తిగా పెట్టుకుని వేర్వేరుగా కాపురం ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే సంపాదనలో ఇద్దరూ కూడబలుక్కుని పిల్లలకు తెలియకుండా కొంతదాచిపెట్టేవారు. నెలరోజుల క్రితం తంగమ్మాళ్ ఆస్మావ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఒక కుమారుడిని పిలిచి ఇంటిలో తన అంత్యక్రియల ఖర్చుకోసం కొంతసొమ్ము పొదుపుచేసి ఉన్నాను, అందులో నుంచి కొంత తీసుకురమ్మని పంపింది. ఇంటికి వెళ్లి నగదును చూడగా అవన్నీ రూ.24వేల విలువైన రద్దుకు గురైన రూ.1000, రూ.500 పెద్దనోట్ల కావడంతో అతడు బిత్తరపోయాడు. ఈవిషయాన్ని తల్లికి చెప్పగా తనతోపాటూ సోదరి రంగమ్మాళ్ కూడా ఇలానే రూ.22వేలను దాచిపెట్టి ఉందనే విషయాన్ని తెలిపి కన్నీరుపెట్టుకుంది. లోకజ్ఞానం లేని నిరక్షరాస్యులైన ఈ అక్కచెల్లెళ్లకు పెద్దనోట్ల రద్దు విషయం వీరికి తెలియకపోవడంతో సదరు సొమ్మును బ్యాంకులో మార్చుకోకుండా అలానే ఉంచుకున్నారు. రంగమ్మాళ్ కుమారుడు సెల్వరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత టీవీలు వారిద్దరి ఇళ్లలో ఉన్నా గత కొంతకాలంగా అవిపనిచేయడం లేదని, దీంతో పెద్దనోట్ల రద్దు విషయం వారి దృష్టికి రాలేదని తెలిపాడు. రోజువారీ ఇంటి ఖర్చుల కోసం కొడుకుల నుంచి కొంత తీసుకుంటూ అంత్యక్రియల కోసం వారిద్దరూ కలిసి రూ.46వేలు దాచుకున్నారు. ఆ సొమ్ము ఇక చెల్లదని తెలియడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నాడు. వారిని హెల్పేజ్‌లైన్ ఆదుకునేనా : నిరక్షరాస్యులైన ఆ అక్కాచెలెళ్లకు పెద్దనోట్ల రద్దుతో అనుకోని సమస్య వచ్చి పడింది. మూడేళ్ల కిత్రమే చెల్లకుండా పోయిన నోట్లను చెల్లుబాటు చేసే పరిస్థితులు లేకపోవడం వారిని దిగాలులోకి నెట్టేసింది. వృద్ధుల అవసరాలు, సమస్యలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జారీచేసిన ఉత్తర్వులు అక్కాచెల్లెళ్ల సమస్యను తీర్చేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా సీనియర్ సిటిజన్స్, వృద్ధులకు ప్రభుత్వం ఇప్పటికే చట్టపరమైన సామాజిక భద్రత కల్పిస్తోంది. అంతేగాక వృద్ధులు తమకు అవసరమైన సహాయాన్ని పొందేందుకు టోల్‌ఫ్రీ నంబరును సిద్ధం చేసింది. చెన్నై పరిధిలోని వారు 1253, చెన్నై మినహా ఇతర జిల్లాల వారు 1800–180–1253 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు. హెల్పేజ్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రభుత్వం ఈ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం నలుమూలలా ఉన్న సీనియర్ సిటిజెన్స్, వృద్ధులకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం అదనంగా ఫోన్ నంబర్లను ప్రవేశపెట్టింది. ల్యాండ్ లైన్ : 044–24350375, సెల్‌ఫోన్ : 93612 72792 నంబర్లను ప్రకటించింది. ఈ హెల్పేజ్ లైన్‌కు అక్కాచెల్లెళ్లు తమ సమస్యను తీసుకెళితే ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. -
పింఛన్ ఇప్పిస్తామని చెప్పి.. బంగారం చోరీ
చేర్యాల(వరంగల్ జిల్లా): పింఛన్ ఇప్పిస్తానని చెప్పి రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు నిందితులు.. వృద్ధ మహిళల నుంచి బంగారు ఆభరణాలను కాజేశారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా చేర్యాల మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలోని బండపల్లికి చెందిన రామనర్సవ్వకు పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఒక వ్యక్తి అంగడి బజార్‌లోని ప్రభుత్వాస్పత్రి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. మరో ఘటనలో మండలంలోని చుంచనకోట గ్రామానికి చెందిన ఎంకవ్వ అనే వృద్ధురాలిని ఒక వ్యక్తి పింఛన్ ఇప్పిస్తానని చెప్పి సబ్‌రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు తీసుకొచ్చి బంగారం కాజేశాడు. దీంతో బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.