పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకు లాకర్లలో మాయమైన బంగారం కేసును పోలీసులు ఛేదించారు.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకు లాకర్లలో మాయమైన బంగారం కేసును పోలీసులు ఛేదించారు. సదరు బ్యాంకులో పని చేసే అప్రైజర్ ప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని భీమవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి దాదాపు రూ. 90 లక్షలు విలువ చేసే మూడు కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.