bhimavaram police
-
నారా లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. చదవండి: భీమవరంలో మరో పుంగనూరు.. -
చెంగల్రాయుడును అరెస్ట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, భీమవరం/ఉండి/నెల్లూరు(లీగల్): రాజ్యాంగబద్ధమైన పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను కించపరిచే విధంగా పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏపీ పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను తిడుతూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయన ఖండించకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలకు, పోలీసు, న్యాయ వ్యవస్థలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెంగల్రాయుడు లాంటి వ్యక్తులను చట్టసభలకు పంపిన చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు తమ రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం పోలీసు వ్యవస్థపై పరుష పదజాలంతో నిరాధారమైన, అవాస్తవమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఒక సందర్భంలో పోలీసులను కట్టు బానిసలుగా అభివర్ణించారని, దానిని కూడా ఖండిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి విధులు నిర్వహించడంలో మాత్రమే కట్టు బానిసలుగా ఉంటారని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థ మీద విమర్శలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు ఆర్.రఘురాం, సీఐడీ యూనిట్ అధ్యక్షుడు అక్కిరాజు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, సభ్యుడు సత్యారావు, విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు. చెంగల్రాయుడు, చంద్రబాబుపై విజయవాడలో సీపీకి న్యాయవాదుల ఫిర్యాదు న్యాయ, పోలీసు వ్యవస్థలను కించపరిచేలా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడకు చెందిన న్యాయవాదులు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణాకు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడును ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీకి ఫిర్యాదు చేసిన వారిలో న్యాయవాదులు జి.నాగిరెడ్డి, పి.నిర్మల్ రాజేష్, జె.జయలక్ష్మి, నరహరిశెట్టి శ్రీహరి, కె.వెంకటేష్‌శర్మ, గవాస్కర్, జి.కిరణ్, ఎస్.పరమేష్, బసవారెడ్డి, పి.రాంబాబు, కె.ప్రభాకర్, బి.రమణి, అల్లాభక్షు, ఎం.విఠల్‌రావు, ఎన్.కోటేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చెంగల్రాయుడు, చంద్రబాబుపై భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో, పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో, ఏలూరులో, నెల్లూరులోని చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో, తిరుపతిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఆయనపై చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయ వ్యవస్థ, పోలీసులను కించపరిచేలా చెంగల్రాయుడు వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
అందుకే ఫిర్యాదు చేశా: రఘురామకృష్ణంరాజు
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలను మంచి అవసరాలకు వినియోగించాలని కానీ ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉద్దేశపూర్వక పోస్టులు చేయడం చట్ట రీత్యా నేరమని నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. వారు చేసిన తప్పులకు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకే తాను కేసు పెట్టానని వెల్లడించారు. తనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీ ప్రసంగాన్ని వక్రీకరించిన వ్యక్తి అరెస్ట్ భీమవరం టౌన్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు పార్లమెంట్లో జూన్ 28వ తేదీన చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి ఫేస్బుక్లో పోస్ట్ చేసి, షేర్ చేసిన కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ ఆర్.విజయకుమార్ తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తాడేపల్లిగూడెంకు చెందిన నిందితుడు మద్దుకూరి సురేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను దుర్వినియోగపరిచి అనుచితంగా ప్రవర్తించే వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆకివీడులో బంగారం మాయం కేసు ఛేదించిన పోలీసులు
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకు లాకర్లలో మాయమైన బంగారం కేసును పోలీసులు ఛేదించారు. సదరు బ్యాంకులో పని చేసే అప్రైజర్ ప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని భీమవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి దాదాపు రూ. 90 లక్షలు విలువ చేసే మూడు కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.