కోల్‌సిటీ : కొరియర్‌నంటూ వచ్చిన ఓ గుర్తుతెలియని యువకుడు వివాహిత మెడలోని బంగారు పుస్తెలతాడు తెంపుకొని పారిపోయిన సంఘటన కరీంనగర్ గోదావరిఖనిలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. స్థానిక స్వతంత్రచౌక్‌లోని భవనం పైఅంతస్తులో నిమ్మకాలయ ఏడుకొండలు కుటుంబం ఉంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఏడుకొండలు కోడలు లలిత పైన ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్లింది. అదే సమయంలో ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తి నిలబడి కొరియర్‌ను అని పరిచయం చేసుకుని ‘కిందింటివారికి పార్సల్ వచ్చింది.. తాళం వేసి ఉంది. ప్లీజ్ మీరు సంతకం చేసి తీసుకుని వారికి అప్పగించండి మేడమ్.’ అని కోరాడు.
ఇంట్లో మామయ్య, అత్తమ్మ ఉన్నారు పిల్చుకొస్తానాగండంటూ వెనక్కి తిరిగి వెళ్తుండగా అకస్మాత్తుగా ఆ యువకుడు లలిత నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టి మెడలోని బంగారు పుస్తెలతాడును తెంపుకొని పారిపోయాడు. కిందపడిపోయిన ఆమె భయంతో ఇంట్లోకి పరుగెత్తి కుటుంబ సభ్యులకు వివరించింది. అనంతరం వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితురాలి నుంచి వివరాలు సేకరించి గాలింపు చేపట్టారు. నిందితుడిని గుర్తించడానికి చౌరస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
పార్సిల్ వచ్చిందంటూ.. చైన్ స్నాచింగ్
Published Sun, Jul 19 2015 1:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM
Advertisement
Advertisement