పంజగుట్ట: కస్టమర్లుగా నగల దుకాణానికి వచ్చిన ఇద్దరు మహిళలు రెండు గ్రాముల రింగులు అక్కడ ఉంచి సుమారు మూడుతులాల రింగులను దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పంజగుట్టలోని త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జ్వులరీ షాపునకు గత నెల 21న ఇద్దరు మహిళలు బంగారం కొనేందుకు వచ్చారు. సేల్స్‌మెన్ దృష్టి మరల్చి తమ వెంట తెచ్చుకున్న రెండు గ్రాముల చెవి రింగులను అక్కడ ఉంచి 27.9 గ్రాముల రింగులను తీసుకుని ఉడాయించారు.
సేల్స్‌మెన్స్‌కు లెక్క సరిగ్గా ఉండడంతో వారు గుర్తించలేకపోయారు. ఆడిటింగ్‌లో బంగారం తక్కువగా ఉన్నట్లు గుర్తించిన మేనేజర్ చంద్రశేఖర్ బుధవారం రాత్రి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమరాలు పరిశీలించి నిందితులను గుర్తించారు. ఒకే రకమైన దుస్తులు ధరించిన వారు సికింద్రాబాద్ పాట్ మార్కెట్ నుండి వచ్చారని, అక్కడకూడా పలు బంగారం దుకాణాలను సందర్శించినట్లు తెలిపారు. అక్కడినుంచి పంజగుట్టకు వచ్చి చోరీ అనంతరం ఆటోలో గాంధీ ఆసుపత్రి వరకు వెళ్లినట్లు గుర్తించామన్నారు. అక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కడంతో ఎటు వెళ్లారో తెలియడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment