కలకలం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు వీడింది. దోపిడీ దారులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాలో నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి సీబీఐ అధికారులమంటూ వచ్చి పట్టపగలే ఆరుగురు దుండగులు భారీ దోపిడీ చేసిన విషయం తెలిసిందే. 13 కోట్ల రూపాయల విలువ చేసే 46 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు.