చిందరవందరగా ఉన్న బీరువాలో సామాన్లు
విశాఖపట్నం, యలమంచిలి: పట్టణంలోని రామ్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది.రామ్‌నగర్ శివారు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గొర్లె శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు ప్రవేశించి ఏడున్నర తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. ఇంటి బయట శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటి వెనుక తలుపు తాళం తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు.
బీరువాలో ఉన్న బంగారు,వెండి ఆభరణాలను చోరీ చేశారు. బాధితుడు శ్రీనివాసరావు విశాఖ డెయిరీలో టెక్నికల్‌అసిస్టెంట్‌గా పనిచేస్తుండడంతో తెల్లవారుజామున లేచి డ్యూటీకి బయలుదేరే సమయంలో ఇంటిలో వెళ్లగా చూడగా వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా తెరిచి, దుస్తులు చిందరవందరగా పడిఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించాడు. బాధితుని ఫిర్యాదుమేరకు యలమంచిలి టౌన్ ఎస్‌ఐ నారాయణరావు ఆ ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు.దొంగలను పట్టుకునేందుకు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment