
తుపాకితో బెదిరించి నగల దుకాణంలో చోరీ
నెల్లూరు పట్టణంలోని కాపు వీధిలో ఉన్న జయంతీ జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది.
నెల్లూరు టౌన్: నెల్లూరు పట్టణంలోని కాపు వీధిలో ఉన్న జయంతీ జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది. బుధవారం పట్టపగలే ముగ్గురు గుర్తుతెలియని దుండగులు దుకాణంలో చొరబడి తుపాకులతో బెదిరించి సుమారు 1.5 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దీంతో దుకాణ యజమాని జరిగిన విషయాన్ని వెంటనే పోలీసులుకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.