
సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
జవహర్‌నగర్: ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ ప్రధాన రహదారిసమీపంలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. క్రైం డీసీపీ రాంచంద్రారెడ్డి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్,జవహర్‌నగర్ సీఐ సైదులు, డీఐ నర్సింగరావులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల కధనం మేరకు బాలాజీనగర్‌లో నివసించే కుందారపు నాగభూషణం దంపతులు తమ ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 12గంటల సమయంలో 1వ అంతస్తులో నాగభూషణం, పద్మ దంపతులు ఆరుబయట నిద్రిస్తుండగా ఇంట్లో ఇద్దరు కుమారులు నిద్రిస్తున్నారు. ప్రధాన ద్వారం తీసే నిద్రపోవడంతో దుండగులు లోపలికి ప్రవేశించి డ్రెసింగ్ టేబుల్‌లో ఉన్న దాదాపు 30 తులాల బంగారు అభరణాలు, రూ.10వేల నగదును అపహరించుకుపోయారు. ఉదయం నాగభూషణం దంపతులు లేచి చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా క్లూస్‌టీం సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.వారం క్రితం ఓ ఫంక్షన్ నిమిత్తం బ్యాంక్ లాకర్ నుండి బంగారాన్ని తీసుకువచ్చామని ఇంతలో దుండగులు ఇలాంటి చర్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్వమయ్యారు.