ఇందుకూరుపేట (నెల్లూరు జిల్లా) : ఇంట్లో భద్రపరిచిన 35 సవర్ల బంగారం చోరీకి గురైంది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మైపాడు గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఇంట్లో 35 సవర్ల బంగారం చోరికి గురైంది.
అయితే వీరు ఈ బంగారాన్ని 20 రోజుల క్రితమే బీరువాలో భద్రపరిచినట్లు సమాచారం. కాగా గురువారం బీరువాలో బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ 20 రోజలు మధ్యలోనే కృష్ణయ్య కుటుంబంతో కలిసి పుష్కరాలకు కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలుసుకునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
35 సవర్ల బంగారం చోరీ
Published Thu, Aug 20 2015 3:29 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM
Advertisement
Advertisement