Indukurupet
-
బాణసంచా పేలి వివాహిత దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు ఇందుకూరుపేట : బాణసంచా పేలి ఓ వివాహిత దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని నిడిముసలిలో చేపల గుంత వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిడిముసలికి చెందిన గాలి యాకోబు తుమ్మాలమ్మ గుడి వద్ద చేపల గుంత సాగు చేస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన గోని విజిత (37)తో వివాహేతర సంబందం ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురు ఇంటి నుంచి వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి గుంత వద్దనే ఉన్నారు. వేకువ జామున సమయంలో చలిగా ఉండటంతో చలిమంట వేసుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గుంతల మీద పిట్టలను తరిమేందుకు తీసుకు వచ్చి వసారాలో ఉంచిన బాణసంచాపై నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దీంతో అవి పేలడంతో ఇద్దరు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో విజిత మృతి చెందగా తీవ్రంగా గాయపడిన యాకోబు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు. డీఎస్పీ పరిశీలన ప్రమాదం విషయం తెలుసుకున్న డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షరీఫ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికులతో వివరాలు ఆరా తీశారు. -
అగ్ని ప్రమాదంలో మామడి తోట దగ్ధం
మైపాడు(ఇందుకూరుపేట): మండలంలోని మైపాడులో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి మామిడి తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు మొత్తలు గ్రామానికి చెందిన గౌస్బాష మైపాడు, గంగపట్నం సరిహద్దుల్లో మామిడి తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. తోట సమీపాన ఓ రైతు పొలం వద్ద వ్యర్ధంగా పడి ఉన్న గడ్డిని తగలబెట్టాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మామిడి తోట వరకు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కాపలాదారులు కౌలుదారునితోపాటు స్థానికులకు ప్రమాద విషయం తెలియజేశారు. స్థానికులు వెంటనే చేరుకుని దగ్గరగా బోరు నీరు అందుబాటులో ఉండడంతో మంటలను ఆర్పి తీవ్రతను తగ్గించారు. ఈలోగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. సుమారు రెండెకరాల మేర తోట దగ్ధమవడంతో రూ.6 లక్షల వరకు నష్టం ఉంటుందని బాధితులు తెలిపారు. -
దక్షిణ కోనసీమ ఇందుకూరుపేట
ఇందుకూరుపేట: పచ్చని పొలాలు..పొడవాటి కొబ్బరి చెట్లు.. ఆహ్లాద వాతావరణంతో ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా పచ్చగా పరిఢవిల్లుతూ జిల్లా వాసులుకు దక్షణ కోనసీమగా నిలుస్తోంది. -
35 సవర్ల బంగారం చోరీ
ఇందుకూరుపేట (నెల్లూరు జిల్లా) : ఇంట్లో భద్రపరిచిన 35 సవర్ల బంగారం చోరీకి గురైంది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మైపాడు గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఇంట్లో 35 సవర్ల బంగారం చోరికి గురైంది. అయితే వీరు ఈ బంగారాన్ని 20 రోజుల క్రితమే బీరువాలో భద్రపరిచినట్లు సమాచారం. కాగా గురువారం బీరువాలో బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ 20 రోజలు మధ్యలోనే కృష్ణయ్య కుటుంబంతో కలిసి పుష్కరాలకు కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలుసుకునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.