అగ్ని ప్రమాదంలో మామడి తోట దగ్ధం
అగ్ని ప్రమాదంలో మామడి తోట దగ్ధం
Published Wed, Oct 26 2016 2:10 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
మైపాడు(ఇందుకూరుపేట):
మండలంలోని మైపాడులో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి మామిడి తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు మొత్తలు గ్రామానికి చెందిన గౌస్‌బాష మైపాడు, గంగపట్నం సరిహద్దుల్లో మామిడి తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. తోట సమీపాన ఓ రైతు పొలం వద్ద వ్యర్ధంగా పడి ఉన్న గడ్డిని తగలబెట్టాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మామిడి తోట వరకు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కాపలాదారులు కౌలుదారునితోపాటు స్థానికులకు ప్రమాద విషయం తెలియజేశారు. స్థానికులు వెంటనే చేరుకుని దగ్గరగా బోరు నీరు అందుబాటులో ఉండడంతో మంటలను ఆర్పి తీవ్రతను తగ్గించారు. ఈలోగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. సుమారు రెండెకరాల మేర తోట దగ్ధమవడంతో రూ.6 లక్షల వరకు నష్టం ఉంటుందని బాధితులు తెలిపారు.
Advertisement
Advertisement