ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో మామిడి తోట, చెరుకు పైరు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలంలో చోటుచేసుకుంది. సర్ధన గ్రామానికి చెందిన నారా గౌడ్‌కు గ్రామ శివారులో 5 ఎకరాల మామిడి తోట ఉంది. పక్కనేగల కొండు కిష్టయ్య 9 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని చెరకు సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో మంటలు అంటుకుని చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ క్రమంలో మంటలు పక్కనే గల చెరుకుతోటలోకి వ్యాపించాయి. దీంతో చెరుకుతోట సైతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో మామిడి చెట్లు కాలి రూ.10 లక్షల మేర, చెరుకుతోటకు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధితరైతులు తెలిపారు.
చెరకుపైరు, మామిడితోటఅగ్నికి ఆహుతి
Published Wed, May 4 2016 5:45 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement