సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): ఓ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఓ సభ్యుడికి చెందిన ఆటోలో తిరుగుతూ బంగారం దుకాణాలను టార్గెట్‌గా చేసుకున్నారు. కస్టమర్లుగా నటిస్తూ వ్యాపారుల దృష్టి మళ్లించి బంగారం, వెండి ఆభరణాలు తస్కరిస్తున్నారు. నెల రోజుల్లో మూడు నేరాలు చేసిన ఈ ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని ఓఎస్డీ రాధాకిషన్‌రావు సోమవారం తెలిపారు.
♦ప్రకాశం జిల్లాకు చెందిన వై.రేణుక, ఆమె సమీప బంధువులు ఎం.కిరణ్, వై.రాజు, అతడి భార్యలు తులసి, శ్వేత, మరో బంధువు రాణి 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు.
♦హయత్‌నగర్ ప్రాంతంలో స్థిరపడిన వీరు తొలినాళ్లల్లో చిన్నచిన్న పనులు చేసినా... ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రేణుక నేతృత్వంలో వీరు ముఠా కట్టారు.
♦ఈ ఐదుగురూ కిరణ్‌కు చెందిన ఆటోలో నగరంలో తిరుగుతూ దారిలో కనిపించిన జ్యువెలరీ దుకాణాల్లో తమకు అనువుగా ఉన్న దాన్ని ఎంచుకుంటారు.
♦వినియోగదారుల మాదిరిగా అందులోకి ప్రవేశిస్తారు. ఒకరు నగలు, వస్తువులు చూపించాల్సిందిగా యజమానికి చెప్తారు. ఆయన ఆ పనిలో ఉండగా మిగిలిన వారు అతడి దృష్టి మళ్లించి చేతికి చిక్కిన బంగారు, వెండి వస్తువులు తస్కరిస్తారు.
♦వీటిని తమ వస్త్రాల లోపలి భాగాల్లో ప్రత్యేకంగా కుట్టించిన అరల్లో పెట్టుకుని ఆ దుకాణం నుంచి బయటకు వచ్చేస్తారు. ఆపై అంతా కలిసి తమ ఆటోలోనే ఉడాయిస్తారు. చోరీ సొత్తును విక్రయించి వచి్చన సొమ్ము పంచుకునేవారు.
♦ఇదే తరహాలో చిక్కడపల్లిలోని రామ్‌స్వరూప్ జ్యువెలర్స్ నుంచి 600 గ్రాముల వెండి ఆభరణాలు, నాచారంలోని ఓమ్‌సాయి జ్యువెలర్స్ నుంచి 50 తులాల వెండి ఆభరణాలు, తుకారామ్‌గేట్‌లోని త్రిషాల్ జ్యువెలర్స్ నుంచి 400 గ్రాముల వెండి తస్కరించారు.
♦తుకారాంగేట్ కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్‌లతో కూడిన బృందం దర్యాప్తు చేసింది.
♦సోమవారం ఆరుగురినీ పట్టుకుని వీరి నుంచి ఆటోతో పాటు 1070 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకుంది. వీటి విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిందితుల్ని తుకారాంగేట్ పోలీసులకు అప్పగించింది.
♦ఈ ముఠాకు చెందిన రేణుకపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 13 కేసులు, కిరణ్‌పై 3, తులసిపై 8, శ్వేతపై 3, రాజుపై 2 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీళ్లు వాంటెడ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: కూకట్‌పల్లిలో పట్టుబడ్డ గంజదొంగ
బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్
Comments
Please login to add a commentAdd a comment