రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది.
శంకర్‌పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. శంకర్‌పల్లిలో నివాసం ఉంటున్న అరుదేష్ అనే వ్యాపారి కుటుంబంతో కలిసి మూడు రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లాడు. బుధవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో బీరువాలో పెట్టిన 85 తులాల బంగారు, 5లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని గమనించాడు. ఈ విషయంపై శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.