జగిత్యాలలో 15 తులాల బంగారం చోరీ
Published Sat, May 20 2017 12:42 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM
జగిత్యాల: జగిత్యాల పట‍్టణంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో దొంగలు హల్‌చల్ చేశారు. స్ధానికంగా నివాసం ఉంటున‍్న రాచర‍్ల మహేష్ అనే వ‍్యక్తి ఇంట‍్లో శనివారం వేకువజామున దొంగలుపడి 15 తులాల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్ దోచుకెళ్ళారు. ఉక‍్కపోత కారణంగా కుటుంబసభ‍్యులు డాబాపై నిద్రిస్తుండగా ఇంటి కిటికీ ఊచలు తొలగించి లోనికి జొరబడిన దొంగలు బీరువాలోని 15 తులాల బంగారు నగలు, ల్యాప్‌టాప్ దోచుకెళ్లారు. ఉదయం లేస్తూనే చోరీ జరిగిన విషయం గమనించిన మహేష్ జగత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ ఇంటిని పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర‍్యలు చేపట్టారు.
Advertisement
Advertisement