విజయవాడ పట్టణంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ జరిగింది.
విజయవాడ(పడమట): విజయవాడ పట్టణంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ జరిగింది. పట్టణంలోని పడమట ప్రాంతం సమతా రెసిడెన్సీలో నివాసముండే శాంతి కిరణ్ ఇంట్లో గురువారం మధ్యాహ్నం ఈ చోరీ జరిగింది. బాధితుడు కుటుంబంతో కలసి పూజ సామాగ్రి కొనేందుకు షాపుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చోరబడి 60 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.