హైదరాబాద్: నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో బంగారం చోరీ ఘటన కొద్దిసేపు కలకలం రేపింది. ఏసీ భోగీలో ప్రయాణిస్తున్న మదన్ అనే ప్రయాణికుడు తన బ్యాగులో బంగారం చోరీకి గురయిందని చెప్పాడు. తన బ్యాగ్‌లో దాచిన అరకేజీ బంగారు ఆభరణాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.
రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చిన వెంటనే లగేజీ సరిచూసుకున్న మదన్ ఏదో జరిగిందని అనుమానపడ్డాడు. బ్యాగులో వెతకగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని గుర్తించిన వెంటనే బాధితుడు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.