
బాధితురాలు అరుణ
మల్లాపూర్: ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ గోకుల్‌నగర్ కాలనీకి చెందిన బత్తిని నాగరాజు భార్య అరుణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గురువారం సాయంత్రం ఇంట్లో బెడ్‌రూమ్‌లో బట్టలు సర్దుకుంటుండగా ఓ మహిళ, ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె నోటికి ప్లాస్టర్‌ను వేసి అరుణ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, రెండు ఫోన్లు, రూ.1500 నగదు, ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లారు. కొద్ది సేపటి తర్వాత దీనిని గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.