వేంపల్లెలో చోరీ
Published Sat, Nov 26 2016 12:26 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
వేంపల్లే: తాళం వేసి ఉన్న దుకాణంలో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో శనివారం వెలుగుచూసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రెడ్డయ్య దుకాణంలో దొంగలుపడి 4 బంగారు గాజులు, ఓ చైన్ రూ.10 వేల విలువ చేసే రిచార్జ్ కార్డులు ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని వైద్యం కోసం కేరళ వెళ్లాడు. శనివారం తిరిగొచ్చి చూసేసరికి చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై మధుమల్లేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Advertisement
Advertisement