
తిరువొత్తియూరు: ఆదంబాకంలో ప్రైవేటు సంస్థ అధికారి ఇంట్లో 1.22 కేజీల బంగారు, వెండి వస్తువులు చోరీ అయ్యాయి. వివరాలు..జీవన్ నగర్ మూడో వీధికి చెందిన గణేష్ (59) పెరుంగుడిలోని ఓ ప్రైవేటు సంస్థను నడుపుతున్నాడు. ఈ నెల 17వ తేదీ ఇంటికి తాళం వేసుకుని కుటుంబంతో సొంత ఊరు తూత్తుకుడి జిల్లా తిరుచందూర్ వెళ్లాడు. సోమవారం ఉదయం గణేశ్ ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో పక్కింటి వారు గణేష్‌కు సమాచారం అందించారు. దీంతో అతను ఆన్‌లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఇంటిలో ఉన్న రెండు బీరువాలు పగలగొట్టి 150 సవర్ల నగలు, వెండి వస్తువులు, రూ. 4 వేలు చోరీ అయినట్టు తెలిసింది.
మరో సంఘటన
ఆదంబాకం జీవన్ నగర్ మొదటి వీధికి చెందిన వినోద్ ఇంటికి తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి పగులగొట్టి బీరువాలో ఉన్న మూడు సవర్ల నగలు, వెండి వస్తువులు చోరీ చేశారు. ఈ రెండు సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.
చదవండి: బూతులు తిడుతూ, రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు
Comments
Please login to add a commentAdd a comment