
నిందితురాలి నుంచి స్వాధీనం చేసుకున్న నగలతో సీఐ ఎండీ ఉమర్, ఎస్‌ఐ కృష్ణ
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): బీరువాలో నగలు మాయం చేసిన తోడి కోడలిని కొత్తపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ ఎండీ ఉమర్ చేసిన వివరాలు.. మహాంతిపురానికి చెందిన సుతారి వాణి, రఘుబాబు ఇంట్లో 30 కాసుల బంగారపు వస్తువులు మాయమయ్యాయి. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తోటి కోడలైన వించిపేటకు చెందిన సుతారి శ్రీలతను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి బంగారం నగలు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీలత భర్త రవిబాబు, రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ వద్ద టిఫిన్ బండి నడుపుతుంటాడు. శ్రీలత ఫిజియోథెరపీ ఉద్యోగం చేస్తోంది. గత కొంత కాలంగా వ్యాపారాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నిందితురాలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐ కృష్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment