హైదరాబాద్(మల్కాజ్‌గిరి): ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ యువతిని దొంగతనం చేసిందనే నెపంతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ జరిగింది. దీంతో యాజమాన్యం సదరు బాలికపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు యువతి(17)పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను విచారణ పేరుతో హింసించినట్లు తెలుస్తోంది.